Search
Thursday 15 November 2018
  • :
  • :

యోగాలో “ఆల్ టైం రికార్డ్”

Old-Woman-Do-Yoga

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు, ప్రజలు పెద్ద మొత్తంలో యోగాసనాలు వేస్తూ అందరిని ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. యోగా డే ని పురస్కరించుకొని దేశంలో ఉన్న ప్రజలంతా ఈ 99 ఏళ్ళ యోగా గురువును గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. కోయంబత్తూర్ నివాసి అయిన అమ్మనానమ్మాళ్ యోగాసనాలు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ యోగా టీచర్ ను అమ్మనానమ్మాళ్ ను ప్రేమగా (యోగా పాటి)అని పిలుస్తుంటారు. శతాధిక వయస్సులోనూ ఎందరో యోగా గురువులుగా పాఠాలు చెబుతున్నారు. 99 వయసులో కూడా ఈ బామ్మ ఎవరి సపోర్ట్ తీసుకోకుండానే నిలబడటం, నడవడం, కూర్చోవడమే కాకుండా కష్టమైన యోగాసనాలు వేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పశ్చిమోత్తనాసనం, కంధరాసనం, శీర్షాసనంతోపాటు ఇతర యోగాసనాలు చాలా అవలీలగా వేయడం ఈ బామ్మ స్టైల్.

అమ్మనానమ్మాళ్ దాదాపు 50కి పైగా యోగాసనాలలో నిష్ణాతులని ఆమె దగ్గర శిక్షణ పొందిన వారు చెబుతున్నారు. అమ్మనానమ్మాళ్ 2017లో రాష్ట్రపతి చేతుల మీదగా నారీ శక్తి అవార్డ్‌ను కూడా అందుకుంది. ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన ప్రత్యేక విందులో అమ్మనానమ్మాళ్ పాల్గొన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీకి యోగాసనాలకు సంబంధించిన డెమో అందించింది. కర్నాటక ప్రభుత్వం నుంచి యోగా రత్న అవార్డులను అందుకున్న ఘనత ఆమె సొంతం. ఈ యోగా టీచర్ కొడుకు బాలకృష్ణన్ (ఓజోన్ యోగా) పేరుతో యోగా శిక్షణ కేంద్రాన్ని నడుపుతున్నారు. ఇప్పటి వరకు 10 లక్షల మంది విద్యార్థులకు యోగాసనాల్లో శిక్షణ ఇచ్చినట్టు బాలకృష్ణన్ తెలిపారు. అందులోంచి 10 వేలమంది యోగా శిక్షకులుగా పనిచేయడం గమనార్హం. అమ్మనానమ్మాళ్ దగ్గర శిక్షణ పొందిన విద్యార్థులు చైనా, థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా, యుకె వంటి ప్రపంచ దేశాల్లో యోగా పోటీల్లో పాల్గొని ఎన్నో అవార్డులను గెలుపొందిన ఘనత అమ్మనానమ్మాళ్ సొంతం.

Comments

comments