Search
Wednesday 14 November 2018
  • :
  • :

పింఛన్ క్యూలో వృద్ధురాలి మృతి

deathబీబీపేట : ప్రభుత్వం ఇచ్చే పింఛన్ కోసం క్యూలో నిలబడిన ఓ వృద్ధురాలు ఓపిక లేక ఆసరా దొరకక అక్కడే కుప్పకూలి మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా బీబీపేటలో చోటు చేసుకుంది. శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో బీబీపేట పోస్టాఫీస్ లో పింఛన్ ఇస్తారన్న సమాచారంతో వృద్ధులు, వితంతు లు, వికలాంగులు బారులు తీరి క్యూ కట్టారు. క్యూలో నిల బడిన బీబీపేట గ్రామానికి చెందిన ఉడుత శివవ్వ (75) నీరసించి, కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన వెంటనే తహసీల్దార్ జశ్వంత్‌రెడ్డి, విఆర్‌ఓ మాణిక్యం, సర్పంచ్ గాడి లింగంలు హుటాహుటిన పోస్టాఫీస్ వద్దకు వచ్చారు. జరిగిన విషయంపై ఆరా తీశారు. అనంతరం శివవ్వ మృతదేహాన్ని ఆమె నివాసానికి తరలించారు. కాగా పోస్టాఫీస్ ఉదయం 10.30 గంటలకు తెరుస్తారు. పింఛన్‌దారులు ఉదయం 6 గంటల నుంచే క్యూ కట్టారు. దీంతో శివవ్వ క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోయిందని సాటి పింఛన్‌దారులు వాపోయారు.

Comments

comments