Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ఒంటరిగా ఉన్న వృద్ధురాలు హత్య..

Old Women Murder In Medchal District

కీసరః ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం కీసరలో చోటు చేసుకుంది. సిఐ సురేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా, బొమ్మల రామారం మండలం, మల్యాల గ్రామానికి చెందిన పటాన్ పెద్దమ్మ (75) గత కొన్ని రోజులగా కీసరలో నివసిస్తున్న కూతురు ఆముదాల నర్సమ్మ వద్ద ఉంటుంది. స్థానికంగా ఉన్న జూనియర్ కళాశాలలో ఆయాగా పనిచేస్తున్న నర్సమ్మ రోజు మాదిరిగానే పనికి వెళ్లగా పెద్దమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంది. కాగా శనివారం మధ్యాహ్నం ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను హత్య చేసి చెవి కమ్మలు, ముక్కు పుడక, మేడలోని బంగారు ఆభరణం, ఆరు వెండి గాజులను దోచుకెళ్లారు. సాయంత్రం పని ముగించుకొని ఇంటికి వచ్చిన కూతురు నర్సమ్మ తల్లి ఆపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించి ఇరుగు పొరుగు వారికి తెలిపింది. తల్లి అప్పటికే మృతి చెందినట్లు తెలియడంతో బోరు విలపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, జాగిలాలను రప్పించి ఆధారాల కోసం గాలించారు. తెలిసిన వ్యక్తులే దారుణానికి పాల్పడి ఉంటారని బావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments