Home జాతీయ వార్తలు లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా

Om-Birla

న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్‌డిఏ అభ్యర్థిగా రాజస్థాన్‌లోని కోటా ఎంపి ఓం బిర్లా పేరును బిజెపి ఖరారు చేసింది. లోక్‌సభలో అధికార కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉన్నందున ఆయన ఎన్నిక లాంఛనప్రాయమే. ఎన్నిక బుధవారం జరగనుంది. లోక్‌సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ బిజెపి లోక్‌సభ సెక్రటేరియట్‌కు నోటీసు ఇచ్చింది. ఈ తీర్మానానికి అన్నాడిఎంకె, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్ సహా ఎన్‌డిఎ మిత్రపక్షాలన్నీ మద్దతు ప్రకటించాయి. స్పీక ర్ పదవికి ఓం బిర్లా పేరును న్రధాని నరేంద్ర మో డీ ప్రతిపాదించారని పార్టీ వర్గాలు తెలిసాయి. స్పీ కర్ పదవికి మేనకా గాంధీ సహా పలువురు సీనియర్ల పేర్లు వినిపించిన విషయం తెలిసిందే. అయితే చివరికి బిర్లా వైపే బిజెపి అధినేతలు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. నామినేషన్త దాఖలుకు మంగళవారం చివరి రోజు అయినప్పటికీ ప్రతిపక్షం ఇప్పటివరకు స్పీకర్ పదవికి అభ్యర్థిని ప్రకటించలేదు.

57 ఏళ్ల ఓంబిర్లా రాజస్థాన్‌నుంచి మూడు సార్లు ఎంఎల్‌ఎగా, రెండు సార్లు ఎంపిగా గెలిచారు. ఒక వేళ స్పీకర్‌గా ఎన్నికయితే ఆయన ఎనిమిది పార్లు ఎవపి అయిన సుమిత్రా మహాజన్ స్థానంలో స్పీకర్ పదవి చేపడతారు. సాధారణంగా లోక్‌సభ స్పీకర్ పదవికి సీనియారిటీని అర్హతగా పరిగణిస్తూ ఉంటారు. అయితే తొలిసారి, లేదా రెండో సారి ఎంపిగా ఎన్నికయిన వారు కూడా స్పీకర్ అయిన సందర్భాలున్నాయి. 2002లో తొలిసారి ఎంపి అయిన మనోహర్ జోషీ లోక్‌సభ స్పీకర్ అయ్యారు. అంతకు ముం దు స్పీకర్‌గా ఉండిన జిఎంసి బాలయోగి కూడా రెండోసారి ఎంపిగా ఎన్నికయిన వారే. తాజా లోక్‌సభ ఎన్నికల్లో బిర్లా కాంగ్రెస్ అభ్యర్థి రామ్ నరైన్ మీనాపై గెలుపొందారు. ఇదిలావుండగా ఓం బిర్లా ఎన్నికకు మద్దతు పలుకుతున్నట్లు యుపిఎ ప్రకటించింది. ఈ మేరకు లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేతగా ఎన్నికైన అధిర్ రంజన్ చౌదరి ప్రకటించారు.

Om Birla BJP choice for lok sabha speaker