Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ప్రజలతోనే పొత్తు… ఊమెన్‌ ఛాందీ

Omen Chandy is no association with any party

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుండే కాంగ్రెస్ పార్టీ ప్రజలతో అనుబంధం కోసం ఇంటింటి ప్రచారం చేస్తామని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి ఊమెన్ ఛాందీ స్పష్టం చేశారు. పార్టీ నిధి కోసం ప్రజలను ఒక్కొక్క రూపాయి ఇవ్వాల్సిందిగా కోరతామని ఆయన వేలడించారు. మారిన జాతీయ, రాష్ట్ర స్థాయిలోని రాజకీయ పరిస్థితులను వారందరికీ వివరిస్తామని ఊమెన్‌ఛాందీ చెప్పారు. ఆంధ్రరత్న భవన్ లోని పిసిసి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో పరిస్థితులు తెలుసుకోవడానికి, పార్టీ పరిస్థితి అంచనా వేయడానికి అన్ని పర్యటించామని ఆయన స్పష్టం చేశారు. గ్రామ, మండల స్థాయి నుంచి పోలీంగ్‌ బూత్‌ స్థాయి వరకూ కూడా పార్టీ నిర్మాణం చేపట్టాల్సి ఉందని ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, రాయలసీయ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పార్టీలోకి రావడం సంతోషకరమైన విషయంగా పేర్కొన్నారు. ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోకుండా ప్రజలతోనే తమ పొత్తని వచ్చే ఎన్నికలకు ప్రత్యేక హోదా కోసమే వెలుతామని… ఊమెన్ ఛాందీ వివరించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో మూడున్నర గంటల పాటు జరిగిన పిసిసి కార్యవర్గ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, కేంద్రమాజీ మంత్రి పల్లంరాజు, పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఇతర సీనియర్‌ నేతలంతా కార్యవర్గ సమావేశానికి హజరయ్యారు.

Comments

comments