Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

నవంబర్ 3న ’నెక్ట్ నువ్వే

rashmi

ఆది సాయికుమార్ హీరోగా ప్రభాకర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వి4 మూవీస్ బ్యానర్‌లో బన్ని వాసు నిర్మిస్తున్న చిత్రం ‘నెక్స్ నువ్వే’. ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ హిలేరియస్ కామెడీ థ్రిల్లర్‌లో వైభవి, రష్మీ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సాయికార్తిక్ సూపర్బ్‌గా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్మాత బన్ని వాసు మాట్లాడుతూ “వి4 మూవీస్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నం.1గా వస్తున్న ‘నెక్ట్ నువ్వే’తో ప్రభాకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సినిమా పాటలకు విశేష స్పందన వస్తోంది. ఇందులో ఆది సాయికుమార్ పాత్ర చాలా బాగుంటుంది. వైభవి, రష్మీ, అవసరాల శ్రీనివాస్, రఘు ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తారు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ‘ఎ’ సర్టిఫికెట్‌తో ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 3న విడుదలవుతుంది”అని అన్నారు. పోసాని కృష్ణమురళి, బెనర్జీ, ముమైత్‌ఖాన్, రజిత, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీః కార్తిక్ పళని, కథః డి.కె., మాటలుః శ్రీకాంత్ విస్సా, నిరుపమ్ పరిటాల, పాటలుః కె.కె.సాగర్, ఎడిటింగ్‌ః ఎస్.బి.ఉద్దవ్.

Comments

comments