Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

హరితహారానికి గొడ్డలి వేటు

tress*ఒకవైపు మొక్కలు నాటడం…
*మరోవైపు చెట్లను నరకడం
*చోద్యం చూస్తున్న అధికారులు

నేరడిగొండ: పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం నుండి హారిత హారానికి శ్రీకారం చుట్టింది. మొక్కల పెంపకాన్ని చెపట్టి తరిగి పోతున్న వృక్ష సంపదను పెంచటమే ధ్యేయంగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది. మండలంలోని అడవుల్లో అధికారుల నిర్లక్షంతో కలప స్మగ్లర్లు విలువైన టేకు చెట్లను నరికి రవాణా చేస్తూ సోమ్ము చేసుకుంటున్నారనే ఆరోప ణలు వస్తున్నాయి. గత పక్షం రోజుల క్రితం నారాయణ్‌పూర్ బీట్ అటవీ ప్రాంతం నుంచి నిర్మల్ వేళ్లే రోడ్డు మార్గం పక్కనే కూతవేటు దూరంలో ఉన్న అటవీ వృక్షాలను కలప స్మగ్లర్లు రంపంతో విలువైన టేకు వృక్షాలను కోసి రవాణా చేయ గా,ఆక్కడే టేకు వృక్షాల సైజుల తీసుకుని అవసరంలేని కొమ్మ లను అక్కడే వదిలిపోయారు. అడవుల్లో నిత్యం అటవీ శాఖ అధికారులు తమ తమ బీట్ పరిధిల్లో తిరుగుతూ టేకు చెట్లను నరికివేతకు గురయితే గుర్తించి నెంబర్లు వేసుకుంటూ వెళుతు న్నారు. కాని అక్కడే ఉన్న కలపను మాత్రం తీసుకేళాతలేరని స్థానికులు అంటున్నారు. రోడ్ల పక్కనే భారీ వృక్షాలను రంపపు కాటుకు గరైన చూచి వెళ్ళిపోతున్నారే కానీ వీలువైన కాలప సంపదను గాలికి వదిలేసారని, దీని పట్ల పలు అనుమానాలు వస్తున్నాయని మండల ప్రజలు అంటున్నారు. ఈ మధ్య కాలం లో అటవీ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపం వల్ల కొంత మంది కింది స్థాయి ఆధికారులు పట్టించుకోవడం లేదని పలు వురు అంటున్నారు. రెండో విడత హారితహారం నేటి నుంచి శ్రీకారం చుట్టాల్సిన్న విషయం తెలిసిందే. చెట్ల నరికివేతకు అడ్డుకట్ట వేయాల్సి అధికారులు చోద్యం చూస్తున్నారు. కళ్ల ముందే పెద్ద పెద్ద వృక్షాలను నేలకూల్చి తీసుకవెళుతున్న అడ్డు కునే వారు కరువైయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయల విలువైన వృక్ష సంపద తరిగిపోతోంది. మండల కేంద్రాల్లో లక్షల్లో మొక్కలను నాటాలనే లక్షంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతున్నప్పటికీ చెట్ల నరికి వేతకు అడ్డు కోవడంలో అటవీశాఖ అధికారులు పూర్తిగా విఫలమవుతు న్నారనే విమర్శలు ఉన్నాయి.ఇప్పటికైనా సంబంధిత అధికారు లు స్పందించి చెట్లను నరికివేతకు పాల్పడుతున్న వారిపై చర్య లు చేపట్టి నరికి వేతను అరికట్టాలని ప్రజలు కొరుతున్నారు.

Comments

comments