Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

రెండో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు

On the second day, petrol prices went up

వరుసగా రెండో రోజు పెట్రో ధరలు పెరిగాయి. శుక్రవారం ఇంధన ధరలు 1415 పైసలు చొప్పున పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.75.85కు చేరింది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో లీటరు పెట్రోలు ధర వరుసగా రూ.83.24, రూ.78.53, రూ.78.72కు పెరిగింది. డీజిల్ ధర 16 నుంచి 18 పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.67.66గా ఉంది. అలాగే ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో లీటరు డీజిల్ ధర వరుసగా రూ.71.79, రూ.70.05, రూ.71.42గా ఉంది. ఐదు వారాలకు పైగా విరామం అనంతరం తొలిసారిగా గురువారం ఇంధన ధరలు పెరిగాయి. గురువారం ట్రోల్ ధర లీటరుకు 16పైసలు పెరగ్గా, డీజిల్‌పై 12పైసలు పెరిగింది. ఈ నెల రోజుల వ్యవధిలో పెట్రోల్ ధర 22 సార్లు తగ్గగా, డీజిల్ ధర 18 సార్లు తగ్గింది.  అంతర్జాతీయంగా రేట్లను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఉత్పత్తి పెంపునకు ఒపెక్ నిర్ణయాన్ని ఊహించి కొద్ది రోజులుగా పెట్రో ధరల్లో మార్పులు చేయలేదని, ఇరాన్ చమురు సమస్య కారణంగా పరిస్థితిలో మార్పు వచ్చిందని ఐఒసి చైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ప్రతి రోజూ ధరలు సవరిస్తాయి. ఈ ధరలు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయి.

Comments

comments