Search
Monday 24 September 2018
  • :
  • :

12న అవిశ్వాసం నెగ్గేనా?

agriculture12న బల పరీక్ష నిరూపించుకోవాలి ప్రాథమిక వ్యవసాయ
సహకార సంఘం చైర్మన్‌పై అవిశ్వాసం చైర్మన్ పదవికి గండం
నాటకీయ పరిణామాల మధ్య పదవి మూడేళ్లు దాటినా
రాజీనామా చేయని చైర్మన్ చైర్మన్ పదవిపై అధికార పార్టీ కన్ను
సొసైటీ చరిత్రలో మొదటిసారిగా చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం
మొయినాబాద్:సురంగల్ – మొయినాబాద్ ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘం చైర్మన్‌పై పాలకవర్గ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 13 మంది పాలక వర్గ సభ్యులలో తొమ్మిది మంది సభ్యులు తమ సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మాన పత్రాన్ని డివిజనల్ కో ఆప రేటివ్ అధికారికి అందజేశారు. దీనిపై స్పం దించిన అధికారి ఏప్రిల్ 12వ తేదీన చైర్మన్‌తో పాటు 13 మంది పాలక వర్గ సభ్యులు బల పరీక్షకు హాజరు కావాలంటూ నోటిసులు జారీ చేశారు.
ఒప్పందం ఉల్లంఘనే కారణం..
కాంగ్రెస్, బిజెపిలు రెండు పార్టీలు జతకట్టి ఉన్న 5 సంవత్సరాల పదవీ కాలాన్ని మొదటి రెండున్నరేళ్లు కాంగ్రెస్, చివరి రెండున్నరేళ్లు బిజెపి పదవులు చేపట్టాలని ఇరుపార్టీల మధ్య కుదిరిన ఒప్పందం. ఇందులో భాగంగా మొదటి విడతగా కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్‌రెడ్డి కి చైర్మన్ పదవి, బిజెపి అభ్యర్థికి వైస్ చైర్మన్ పదవులు చేపట్టారు. చివరి రెండున్నారేళ్లు బిజెపికి చైర్మన్ పదవి రావాల్సి ఉండగా ప్రస్తుత చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి పదవికి రాజీనామా చేయడానికి నిరాకరించడంతో కథ అడ్డం తిరిగింది. ఒప్పందం కాలంలో 6 నెలలు ఎక్కువ కాలం పదవి అనుభ విస్తున్నా రాజీనామ చేయకపోవడంపై పాలక వర్గ సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. చైర్మన్ పదవిని నాటకీయ పరిణామాల మధ్య సొంతం చేసుకున్న విష్ణువర్ధన్ రెడ్డి మూడేళ్లుగా కొనసాగుతు ండటంతో పాలకవర్గ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పీఠంపై అధికార పార్టీ కన్ను..
సురంగల్ – మొయినాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల సమయంలో తెదేపా మద్దతుదారులుగా గెలుపొం దిన డైరెక్టర్లంతా గత 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో తెరాస పార్టీలో చేరారు. అదే అదనుగా భావించిన అధికార పార్టీ చైర్మన్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని తెరాస నాయకులు వ్యూహాత్మ కంగా అడుగులు వేస్తున్నారు.

Comments

comments