Search
Sunday 18 November 2018
  • :
  • :

ఈ మెకానిక్… బుర్జ్ ఖలీఫాలో 22 అపార్ట్‌మెంట్లకి ఓనర్!

George-V-Nereaparambilదుబాయ్ : ఒక్కోసారి ఓ మాట వ్యక్తిని ఉన్నతుడిని చేస్తుందంటారు. అతడికి లేని శక్తులు వచ్చే తయారు చేస్తుందని చెప్తుంటారు. సరిగ్గా ఓ భారతీయుడి విషయంలో ఇదే జరిగింది. తన స్నేహితుడు అపహాస్యం చేసినట్లుగా అన్న మాటలు ఆ వ్యక్తి సీరియస్‌గా తీసుకున్నాడు. విన్నవారంతా అవ్వాకయ్యే స్థాయికి వెళ్లాడు అతడే మెకానిక్ నెరియాపరాంబిల్. నెరియాపరాంబిల్ ఓ భారతీయుడు. 1976 మధ్యాసియాకు వెళ్లిపోయాడు. స్వతహాగా మెకానిక్ అయిన అతడు అదే పని చేసుకుంటూ గడపడంతో పాటు తండ్రి చేసే పనిలో సహాయంగా ఉండేవాడు.
ఒకసారి అతడి స్నేహితుడు దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా భవనాన్ని చూపిస్తూ.. ఇందులోకి నీ జీవితంలో వెళ్లలేవు అంటూ అపహాస్యం చేసి వెకిలిగా నవ్వాడు. ఓ రోజు ఆ భవనంలో ఫ్లాట్‌లు అద్దెకు ఉంటాయని పేపర్‌లో చదివి సరిగ్గా 2010లో అందులోకి అద్దెకు దిగాడు. అనంతరం ఒక బిజిసెస్‌మేగా మారి తన తెలివితేటలతో అనతికాలంలోనే ఏకంగా అందులో 22 అపార్ట్‌మెంట్లు సొంతం చేసుకున్నాడు. 828మీటర్లు ఉండి మొత్తం 900 అపార్ట్‌మెంట్లు ఉన్న బుర్జ్ ఖలీఫాలో 22 అపార్ట్‌మెంట్లు మన మెకానిక్ నెరియాపరాంబిల్‌వే. అయితే, తన కలను ఇంతటితో ఆపనని, ఇలా కలకంటూనే మరెన్నో అపార్టుమెంట్లు కొనుగోలు చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఈ అనితర మొకానిక్.

Comments

comments