Home ఎడిటోరియల్ అదే ద్వంద్వ నీతి, మళ్లీ మళ్లీ

అదే ద్వంద్వ నీతి, మళ్లీ మళ్లీ

PM-Modiప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత ఆదివారం నాడు ఆకా శవాణిలో ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లా డు తూ, “దేశంలోని భిన్నత్వమే మన సౌం దర్యం” అన్నా రు. ఆభిన్నత్వంపై దాడికి సంఘ్ పరి వార్ శక్తులు ఇటీవలి కాలంలో రెచ్చిపోయి ప్రయ త్నిస్తున్న నేపథ్యంలో, దేశ ప్రధాని, అదే సంఘ్ పరివార్‌కు చెందిన నాయకుడు, ఆ విధంగా మా ట్లాడ టాన్ని తగినంత మంది ప్రశంసించారు. ఆయన అ ట్లా మాట్లాడటం “ మొదటిసారి”అని ఆనం దిం చారు. కనుక పరి స్థితిలో మార్పు రావచ్చునని ఆశిం చా రు. కాని ఇది కేవలం భ్రమ అని 48గంటలలో తేలి పోయింది. అదే ప్రధానమంత్రి ప్రభుత్వం పర్య వేక్షించే ఢిల్లీ పోలీసులు, దేశ రాజధాని ఢిల్లీలో గల కేరళ భవన్‌లో ఆవు మాంసం వండి వడ్డిస్తున్నారని హిందూ శివసేన వారు ఫిర్యాదు చేశారంటూ ఆ భవనంలో ప్రవేశించి సోదాలు చేశారు. ఈ దేశపు “భిన్నత్వ సౌందర్యాన్ని” మోడీ ప్రభుత్వ ప్రత్యక్ష ని యంత్రణలో గల పోలీసులు గౌరవించిన తీరు ఇది. వాస్త వానికి ఈ విధమైన ద్వంద్వ నీతి మొదటి నుంచి కనిపి స్తున్నదే. కనుకనే ప్రధానమంత్రి ‘మన్ కీ బాత్’తో చాలా మంది భ్రమపడలేదు కూడా.
ఢిల్లీ ఉదంతం వివరాలు మరికొంత చూసి, ఆ తర్వాత చర్యలోకి వెళదాము. ఢిల్లీలో అన్ని రాష్ట్రాలకు భవన్‌లు ఉన్నట్లు కేరళకు కూడా ఒకటుంది. అవి అతిథి గృహాలుగా, ఆయా రాష్ట్రాలకు, దేశ రాజధా నిలో ఉండే పరిపాలనా పర మైన వ్యవహారాలకు అనుసంధాన కార్యాలయాలుగా, సాం స్కృతిక కేం ద్రాలుగా ఉంటాయి. అందులోనే తమ ప్రాం తీయ వంటకాలతో భోజనాలయాలు కూడా నిర్వహిస్తారు. ఆవులు, లేగల వధను నిషేధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ రాజ్యాంగంలోని 48వ ఆర్టి కల్ నిర్దేశిస్తున్నది. కాని ఇది ఆదేశిక సూత్రా లలో మాత్రమే ఉన్నం దున సూచన అవుతుంది తప్ప విధ నిబద్ధం కాదు. ఆ మేరకు చ ట్టాలు చేయటం రాష్ట్రాల పని. చేస్తాయా లేదా అనే స్వేచ్ఛ వాటికుం టుంది. అట్లా చట్టాలు కొన్ని రాష్ట్రాలు చేయగా కొన్ని చోట్ల చేయలేదు. చేయని వాటిలో కేరళ ఒకటి. అదే ప్రకారం కేరళలో ఆవు మాంసం లభిస్తుంది.
ఇది రాజ్యాంగం, చట్టాల పరిస్థితి కాగా ఢిల్లీలో వి షయ మేమిటో చూద్దాము. అక్కడి కేరళ భవన్‌లో ఆ వు మాంసం వడ్డిస్తున్నారని హిందూ శివసేన ఫిర్యాదు చేసింది. ఆవు మాంసంపై కేరళలో నిషేధం లేదు గదానని ఢిల్లీ కేరళ భవన్‌లో వడ్డిస్తామనే స్వేచ్ఛ కేరళ ప్రభుత్వానికి ఉండదు. ఎందుకంటే ఢిల్లీలో గోవధ నిషేధం. కొందరు కేరళ భ వన్‌ను ఢిల్లీలో ఉండే విదేశీ రాయబార కార్యాలయాల తర హా అంతర్గత స్వేచ్ఛ తో పోల్చారు. కాని అది చెల్లదు. ఎంబె సిలకు అంత ర్జా తీయ దౌత్య నిబంధనల ప్రకారం ఇ మ్యూనిటీ క్లాజ్ వర్తిస్తుంది. కేరళ ఇదే దేశంలోని ఒక రాష్ట్రం. ఆ రాష్ట్రపు చట్టాలు అదే రాష్ట్ర పరిధిలో పనిచేస్తాయి గాని బయట కాదు. అందువల్ల, గోవధపై నిషేధం ఉన్న ఢిల్లీలో వారు గోమాంసాన్ని వడ్డిస్తే అది చట్ట ప్రకారం నేర మవుతుంది. అటువంటి నేరం ఆ భవన్‌లో జరుగుతున్నట్లు ఎవరైనా ఫిర్యాదు చేసిన పక్షంలో దానిపై విచారణ జర పటం అక్కడి పోలీసుల చట్ట పరమైన బాధ్యత అవుతుంది.
వాస్తవంగా జరిగిందేమిటి? ఢిల్లీ కేరళ భవన్‌లో ఆవుమాంసం వంటకాలు ఇప్పుడు కాదు గదా, ఎప్పుడూ లేవు. ఇది ఈ రచయితకు స్వయంగా తెలి సిన విషయం. ఢిల్లీ లో ని కేరళ జర్నలిస్టు మిత్రులు తమ రాష్ట్రంలో ఆవు మాంసం తినే అలవాటున్నవారు గనుక, అది ఇక్కడ కేరళ భవన్‌లో లభించదు గనుక, ఈశాన్య రాష్ట్రాల భవన్స్‌కు వెళు తుండేవారు. ప్రస్తుత సం దర్భంలోనూ కేరళ భవన్‌లో అటు వం టి వంట కమేమీ జరగలేదు. వారు వండింది దున్న పో తు మాంసం. మెనూలో రాసింది కూడా అదే. కాని అది చూ సిన హిందూశివసేనవారు బహుశా బయటి ప్రాంతం వారు గనుక కావచ్చు. దానిని ఆవుమాం సంగా అపోహా పడి లేదా దురుద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంత వరకు అన్నింటికీ ఏదో ఒక తర్కం ఉంది. కా ని ఆ తర్వాత జరగవలసింది ఏమిటి? పోలీసులు సెర్చ్ వారెంట్లు తీసుకుని, వాటిని కేరళ భవన్ కమి షన్‌కు చూపి, అ ప్పుడు తనిఖీలు చేయాలి. లేదా కమి షనర్‌కు ఫిర్యాదు గురించి తెలియజేసి, తన అంగీ కారం తీసుకుని, ఒకవేళ నేరం చాలా తీవ్రమైనది అ యితే తీసుకోకుండానైనా సరే, అప్పు డు తనిఖీ చే యాలి. కాని వారెంట్లు ఉండి తనిఖీ చేసినా, లే కుం డా చేయదలచినా, ముందుగా కమిషనర్‌కు తెల పటం మాత్రం తప్పనిసరి. మామూలుగా మన ఇంటికి వచ్చిన ప్పు డు కూడా పోలీసులు ముందుగా విషయం చెప్పి, సెర్చ్ వారెంట్ చూపి, అప్పుడు తని ఖీ చేయాలి. అటువంటప్పుడు ఆ నియమం ఒక రాష్ట్ర ప్ర భుత్వ భవనానికి మరింతగా వర్తి స్తుందని చెప్పన క్కరలేదు. కాని, కేంద్ర హోంశాఖ ప్రత్యక్ష ని యం త్రణలో ఉండే ఢిల్లీ పోలీసులు ఇందులో దేనినీ పాటిం చ లేదు.అన్ని నియమాలను ఉల్లంఘించారు. ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుని తర్వాత చర్చలోకి పోదాము. పైన చెప్పి న ట్లు, ఢిల్లీలోని ఈశాన్య రాష్ట్రాల భవనాలలో ఏ మాంసం కూడా నిషిద్ధం కాదు. అక్కడ త్రిపుర మిన హా మరే రాష్ట్ర మూ గోవధను నిషేధించలేదు కూడా.
దానినట్లుంచితే, ఢిల్లీ పోలీసులు ఆ విధంగా ఎం దుకు వ్యవహరించినట్లన్నది ప్రశ్న. స్పష్టంగా కనిపి స్తు న్నది ఏమ ంటే, వారి అధికారులు విషయాలను అర్థం చేసుకోలేని వా రు కాదుగాని, దేశంలో కొత్తగా ఏ ర్పడిన ఒక వాతావ ర ణ ంలో పని చేస్తున్నారు. ఫి ర్యాదు చేసిన సంస్థ హిందూ శివ సేన.తాము పని చేస్తున్నది సంఘ్‌పరివార్ ప్రభుత్వ ప్రత్య క్ష పర్య వేక్షణలో. కనుక అదిసృష్టించే ఒత్తిడిని ఊహించవ చ్చు. ఇటువంటి వాతావరణం ఏర్పడే విధంగా మనం ఒక వైపు నిరంతరం ప్రయత్నిస్తూ,మరొకవైపు భిన్న త్వం సౌందర్యాల గురించి మాట్లాడటాన్ని ఏమం టాము? దానికి ‘ద్వంద్వ నీతి’ అనిగాక మరేమైనా పదమున్నదేమో తెలియదు.
సంఘ్‌పరివార్‌లోని ఇతరుల విషయం అట్లుంచి, రా జ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రధానమంతి రాజ్యా ం గ బద్ధంగా పాలించవలసి ఉన్నప్పుడు ఆ స్ఫూర్తికి విరుద్ధమైన రీతిలో ద్వంద్వ నీతిని పాటించినట్లయితే తన పట్ల విశ్వాసం కలిగేది ఏవిధంగా? ఆవు అన్నది ఒక పెద్దవ ర్గానికి బల మైన సెంటిమెంటు అయిన ప్పుడు దానిని ఇతరులు గౌరవి ంచాలనటంలో తప్పు లేదు కాని దేశంలో జరు గుతున్నది ఆవును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించు కోవ టం. ఆవుతో ముడిపడిన వేల ఏళ్ల చరిత్రపై, వర్త మా నస్థితి గురించి రెండువైపులా లెక్కలేనంత చర్చ జరి గింది. సమస్య దానితో లేదు. విషయానికి గల అన్ని కో ణాల నుంచి కూ డా చర్చించవచ్చు. ఎవరెంత చర్చిం చి ఎంత బల మైన వాద నలు చేసినా ఈ చర్చ ఎప్ప టికీ ముగి సేది కాదు. అంతేకాక మరొకటి కూడా ఇరు పక్షాలు గ్రహిం చాలి. సంఘ్‌పరి వార్ కు లోక్ సభలోని మొత్తం 543స్థానాలు లభించి దేశంలోని ప్ర తి ఒక్క రాష్ట్రాన్ని వారు గెలవగలిగినా గోహత్యను నూ టికి నూరుశాతం ఆపలేరు, అమలు పరచలేరు. అదే విధం గా వీరసెక్యులరిస్టులు అంటూ ఎవరైనా ఉండి వారు అదే స్థాయిలో అధికారానికి వచ్చినా గోహ త్యను నూటికి నూరు శాతం చట్టబద్ధం చేయలేరు. ఉభ యులలో ఎవరేది చేయ బూనినా అది తీవ్రమైన కల్లోలానికి, రక్తపాతానికి దారితీ స్తుంది. అది ఈ దేశ ంలోని వైవిధ్యతలతో ముడిపడిన సామాజిక వాస్త వికత.
సమస్య వస్తున్నది రాజకీయాలతో, సమస్యాత్మక రాజకీయాలు ముడిపడి ఉన్నది ఒక్క ఆవుతోనే కాదు. అనేకానేక అంశాలలో ఆవు ఒకటి మాత్రమే . కాని ఆవుతో సహా కేవలం సెంటిమెంట్లు, అవి సెక్యులర్ సెంటిమెంట్లు అ యినా సరే, ఎవరికి కూడా తాత్కాలి కంగా తప్ప సీట్లను పెం చలేదు, అధికారాన్నివ్వలేదు. పేరు ఏది చెప్పినా వీరం దరి లక్షం అధికారం, ధన సంపాదన,తమతరగతుల ప్రయోజనాలను నెర వేర్చ టం గనుక, అందుకోసం ప్రజల ఓట్లను ఇతర మా ర్గాలలో కూడా సంపాదించవచ్చు. ఆటిలో అత్యు త్త మై న మార్గం జనరంజకమైన, ప్రజాస్వామ్య బద్ధ మై న పాలన. ఈ దేశం హిందువులు మెజారిటీలో గలది అయినా,‘హిందూవ్యవస్థ’ను(అటువంటిదంటూ అస లు ఉంటే) గాక ఆధునిక ప్రజాస్వామిక పార్లమెం టరీ వ్యవస్థనే ఎంచుకుంది. హిందువులలో అత్యధిక సంఖ్యాకులు స్వాతం త్రోద్యమ దశలోగాని, తర్వాత గాని ‘హిందూ’ పార్టీలనేమీ ఎంచుకోలేదు.
అందువల్ల, ప్రధానమంత్రి ‘మన్ కీ బాత్’ కేవలం ఎతు గడ కానట్లయితే, తన గుజరాత్‌కే చెందిన మహా త్మాగాంధీ నుంచి, తన ‘బరాక్… బారాక్‌” అంటూ ఆత్మీయంగా సంబోధించే ఒబామా మొదలు కొని, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు, చివరకు వేదాలు, ఉపనిషత్తులు సైతం గుర్తించి మన్నించిన భారతీయ సామాజిక వైవిధ్యతా సౌంద ర్యాన్ని, ప్రపంచంలోనే ఎక్కడలేనంతటి మహనీయ మైన విస్తృతిని, దాని గాఢతను, వేల ఏళ్ల నిరంతర చరిత్ర ప్రవాహాన్ని నిజా యితీతో అనుసరించటం మంచిదవుతుంది. తనది ద్వంద్వ నీతి అని ప్రజలు గ్రహించినపుడు, తను ఆశిం చిన ప్రయో జనమైనా సిద్ధించగలదా.
సెల్ : 9848191767