Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

మళ్లీ పాండ్యాను ఆటాడేసుకుంటున్నారుగా..!

Once again Fans Troll Indian Cricketer Hardik Pandya

ముంబయి: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యపై నెటిజన్లు మరోసారి కన్నెర్ర చేశారు. దీనికి కారణం తాజాగా పాండ్య సోషల్ మీడియాలో షేర్ చేసిన అతడికి సంబంధించిన ఓ ఫోటోనే. ఇటీవల ఇంగ్లండ్ తో ముగిసిన 5 మ్యాచుల టెస్ట్ సిరీస్ లో కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు 4-1 తేడాతో ఘోర పరాజయాన్ని ముటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో పాండ్య ప్రదర్శన కూడా అంతంతా మాత్రంగానే ఉండింది. దీంతో అభిమానులు ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఇంగ్లండ్‌పై టీమిండియా టెస్టు సిరీస్‌ ఓడిపోవడానికి గల కారణాల్లో పాండ్యా ప్రధాన కారణమంటూ అతడిని నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. దీంతో హార్దిక్ సామాజిక మాధ్యమాల్లో ఏ ఫోటో పెట్టిన అతడిపై అభిమానులు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఇక ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు తర్వాత లండన్‌ వీధుల్లో విహరిస్తూ దిగిన ఫోటో పోస్ట్ చేయగా దానిపై కూడా నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఫ్యాషన్ పై కాదు ముందు ఆటపై దృష్టిసారించాలని చూరకలంటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఇంగ్లండ్ సిరీస్ ముగించుకుని ఇంటికి చేరిన పాండ్యా ఇంట్లో సరదాగా ఫోటో దిగి ఇన్ స్టాగ్రామ్ లో పెట్టాడు. అలాగే ‘ఇంగ్లండ్‌ పర్యటనలో చాలా పోరాడాం. ఈ సిరీస్‌ చాలా ఉపయోగపడింది. చాలా రోజుల తర్వాత ఇంటికి రావడం సంతోషంగా ఉంది. కానీ తక్కువ సమయంలోనే ఆసియా కప్‌ కోసం బయల్దేరాలి’ అని రాశాడు. అంతే… అభిమానులు ఈ పోస్టుపై ట్రోల్ చేస్తూ హార్దిక్ తో ఆటాడేసుకుంటున్నారు. ‘నువ్వు క్రికెట్‌ ఆడటానికి పనికిరావు, ర్యాపర్‌గా సెట్‌ అవుతావు.. ఆ ప్రయ​త్నం మొదలు పెట్టు’ , ‘పాండ్యా నువ్వు ఓ గ్యాంగ్‌ స్టర్‌లా ఉన్నావు ’ , ‘పాండ్యాకు స్టైల్‌ మీద ఉన్న ప్యాషన్‌ క్రికెట్‌పై లేదని’ ఇలా విమర్శాత్మక కామెంట్లతో పాండ్యాకు ఊపిరాడకుండా అభిమానులు పంచ్ ల మీద పంచ్ లు విసురుతున్నారు.

Comments

comments