Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

firingవాషింగ్టన్ : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కొలంబస్‌లోని ఒహియో స్టేట్ యూనివర్శిటీలో సోమవారం ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. యూనివర్శిటీ ఇంజినీరింగ్ భవనంలోకి చొరబడ్డ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఏడుగురు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన విద్యార్థుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. యూనివర్శిటీ ప్రధాన ద్వారాలు మూసివేసి, మిగితా విద్యార్థులు సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు స్థానిక పోలీసుల సహాకారంతో యూనివర్శిటీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం దుండగుడు యూనివర్శిటీ ఆవరణలోనే చొరబడి ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments