Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

మరోసారి సావిత్రి పాత్రలో…

kirti-suresh

బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో ఎన్‌టిఆర్ బయోపిక్ శరవేగంగా తెరకెక్కుతోంది. బాలయ్య స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో విద్యాబాలన్, రానా, మోహన్‌బాబు, సచిన్ కేడెకర్ తదితరులు నటిస్తున్నారు. అలాగే అతిథి పాత్రల్లో కొందరు ప్రముఖ నటీనటులు కనిపించనున్నారు. కాగా ఈ సినిమాలో అలాంటి అతిథి పాత్ర అయిన మహానటి సావిత్రి పాత్రలో కీర్తిసురేష్ నటించనుండడం విశేషం. నందమూరి తారకరామారావుతో  కలిసి సావిత్రి చాలా సినిమాల్లో నటించింది. అందులో చాలా చిత్రాలు క్లాసిక్ మూవీలుగా మిగిలిపోయాయి. అయితే వాటిల్లో అద్భుతమైన కళాఖండాలుగా పేరుగాంచిన చిత్రాలు మాయాబజార్, మిస్సమ్మ. ఎన్‌టిఆర్ బయోపిక్‌లో ఈ రెండు చిత్రాల ప్రస్తావన కూడా ఉంటుందట. కీర్తిసురేష్ సావిత్రిగా కనిపించేది మాయాబజార్ సినిమాలోని శశిరేఖ పాత్రలో, మిస్సమ్మ సినిమాలోని మేరీ పాత్రలో అని తెలిసింది. ఇక ఈనెల 5న సెట్స్‌పైకి వెళ్లిన ఎన్‌టిఆర్ బయోపిక్ ఫస్ట్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 9న సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేయనున్నారు.

Comments

comments