Home వార్తలు బ్యూటీక్వీన్లతో వన్స్‌మోర్…

బ్యూటీక్వీన్లతో వన్స్‌మోర్…

actressకొన్ని కాంబినేషన్లు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి. హిట్ కాంబినేషన్‌లో సినిమాలు అద్భుతంగా తెరకెక్కుతాయి. హీరో-హీరోయిన్, హీరో-డైరెక్టర్… ఈ హిట్ కాంబినేషన్ల కోసం ఇప్పటివరకు మూవీ మేకర్స్ వెంపర్లాడేవారు. హిట్ ఫార్ములాని రిపీట్ చేయాలనే కోరికే ఇందుకు కారణం. ఇప్పుడు హీరోయిన్-డైరెక్టర్ కాంబినేషన్‌లు కూడా పెరుగుతున్నాయి. తాజాగా ఈ కొత్త కాన్సెప్ట్ కూడా ప్రారంభమైంది.
రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకునే, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చారిత్రక చిత్రం ‘బాజీరావ్ మస్తానీ’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపుది ద్దుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కాశీబాయి పాత్రలో అందాల తార ప్రియాంకా చోప్రా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ప్రస్తుతం హాలీవుడ్ మూవీ ‘బేవాచ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రియాంక… ఇది పూర్తికాగానే మళ్లీ సంజయ్‌లీలా భన్సాలీ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనుందని సమాచారం. కాశీబా యి పాత్ర తెచ్చిన గుర్తింపే ఇందుకు కారణం. అలియాభట్ కెరీర్‌లో ‘హంప్టీ శర్మకీ దుల్హనియా’ చెప్పుకోదగ్గ మూవీ. కరణ్‌జోహార్ నిర్మించిన ఈ చిత్రం 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ చిత్ర దర్శకుడు శశాంక్ ఖైతాన్ తన నెక్స్ ప్రాజెక్ట్ ‘బద్రీనాథ్ కీ దుల్హనియా’లో కూడా అలియా భట్‌నే హీరోయిన్‌గా తీసుకుంటున్నాడు. హీరో వరుణ్‌ధావన్‌ను కూడా రిపీట్ చేయనుండడం విశేషం. కామెడీ డ్రామా ‘క్వీన్’ మూవీ కంగనారనౌత్‌కు ఎంతటి స్టార్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టిందో తెలిసిందే. సినిమాలో అన్నీ తానై హైలైట్‌గా నిలిచిన కంగన కు జాతీయ

ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చింది. ఆతర్వాత ఒక్కసారిగా కంగనను బాలీవుడ్ క్వీన్‌గా మార్చేశాడు డైరెక్టర్ వికాస్ బెహ్ల్. మరోసారి వీరి కాంబినేషన్ రిపీట్ కానుంది. అయితే ఇది ‘క్వీన్’ సీక్వెల్ కాదు. శశాం కా ఘోష్ దర్శకత్వంలో సోనమ్ కపూర్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఖూబ్‌సూరత్’. సినిమాలో సోనమ్ తన గ్లామర్‌తోనే కాదు నటనతోనే కూడా ప్రేక్షకులను మంత్రము గ్ధులను చేసింది. ఇక 1998లో వచ్చిన మూవీ ‘రన్ లోలా రన్’ను రీమేక్ చేసే యోచనలో ఉన్న శశాంకా ఘోష్ ఈ సినిమా లోనూ సోనమ్‌తో వర్క్ చేయనున్నాడు. బ్లాక్‌బస్టర్ హిట్ ‘ఆషికి 2’ చిత్రంతో హీరోయిన్‌గా మంచి పాపులారిటీ సంపాదించింది శ్రద్ధాక పూర్. ఈ సినిమా ఆమెకు గ్లామరస్ తారగా భారీ క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. బాక్సాఫీస్ హిట్‌గా నిలిచి ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చింది ఈ మూవీ. ఇప్పుడు ‘హాఫ్ గాళ్ ఫ్రెండ్’ నవలను తెరకెక్కిస్తూ… శ్రద్ధాకపూర్‌నే హీరోయిన్‌గా తీసుకు న్నాడు మోహిత్. ఈవిధంగా ఒకసారి పనిచేసిన హీరోయిన్‌లోని పూర్తి టాలెంట్‌ను తెలుసుకొని మరోసారి ఆ భామతోనే సినిమా చేసేం దుకు కొందరు డైరెక్టర్లు ఆసక్తి చూపుతున్నారు. గ్లామర్ పరంగానే కాదు నటనాపరంగానూ హీరోయిన్‌ను మరింత హైలైట్‌గా చూపించేందుకు డైరెక్టర్లు ఇలా కాంబినేషన్లను రిపీట్ చేస్తున్నారు.