Home తాజా వార్తలు ఒక్క ఎకరం భూమి అయినా పంచావా ?

ఒక్క ఎకరం భూమి అయినా పంచావా ?

                       Jagan-Nandyal

ఆంధ్రప్రదేశ్: ప్రతి పేదవాడికి బాబు వ్యవసాయ భూములు పంచుతామన్నారని, మూడున్నరేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క ఎకరా అయినా పంచారా ? అని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రశ్నించారు.  నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా జగన్ పలు  ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. బాబు సిఎం అయ్యోనాటికి నంద్యాలలో 21 వేల 800 పింఛన్ కార్డులుండేవని, మూడున్నరేళ్లలో 10వేలకు తగ్గించారని మండిపడ్డారు. బాబు సిఎం కాక ముందు ప్రజలకు రేషన్ షాపులలో తొమ్మిది రకాల  కిరాణాలు ఇచ్చేవారని,  ఇప్పుడు బియ్యం తప్పితే ఏమి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుందు నది వరదల నుంచి కాపాడటానికి నంద్యాలకు ఒక్క రూపాయైనా సిఎం ఇచ్చారా అని నిలదీశారు. బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నారు, రద్దు చేశారా అని అడిగారు.

ఆరోగ్య శ్రీతో వైఎస్‌ఆర్ పేదలకు ప్రాణం పోశారని, 108కు ఫోన్ కొడితే చాలు అంబులెన్స్ వచ్చేదని, ఇప్పుడు 108కు ఫోన్ కొట్టిన రావడం లేదని ఓ వృద్ధురాలు వాపోయారు. ఎనిమిది నెలల నుంచి నెట్ వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం బకాయిలు పెట్టిందని, కాంక్లయిర్ ఇంప్లాటేషన్ ఆపరేషన్ ఇప్పుడు చేయించేవారే లేరని దుయ్యబట్టారు. వైఎస్ హయాంలో ఇల్లు, పొలం అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా, ఫీజు రియింబర్స్‌మెంటుతో పేదలు పెద్ద పెద్ద చదువులు చదువే వారని గుర్తు చేశారు. ఇంజినీరింగ్ చదవాలంటే ఏడాదికి లక్ష అవుతోందని, చంద్రబాబు మాత్రం ఏడాదికి 35 వేలు పెండింగ్ పెట్టి మరీ ఇస్తున్నారని మండిపడ్డారు.