Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

బయోపిక్‌కు కోటిన్నర పారితోషికం

Vidhya-Balan

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బయోపిక్ మూవీ ‘ఎన్‌టిఆర్’. ఇందులో బాలీవుడ్ తార విద్యాబాలన్ బసవతారకం పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం బాలయ్య స్వయంగా విద్యాబాలన్ ఇంటికి వెళ్లి ఆమెను ఒప్పించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న విద్యాబాలన్… బసవతారకం పాత్రలో అద్భుతంగా నటిస్తోంది.  అయితే ఈ చిత్రంలో నటిస్తున్నందుకు విద్యాబాలన్‌కు భారీ పారితోషికాన్ని అందజేస్తున్నారు. ఆమె ఈ సినిమాలో నటించడానికి కోటిన్నర డిమాండ్ చేసిందట. అయితే పాత్రకు ఉన్న డిమాండ్ మేరకు బాలయ్య, క్రిష్ అంత మొత్తం ఇచ్చేందుకు ఓకే చెప్పారని తెలిసింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్లు తీసుకుంటున్న అత్యధిక మొత్తం కోటి రూపాయలు మాత్రమే. మరి విద్యాబాలన్‌కు భారీ పారితోషికం ఇవ్వడానికి కారణం ఈ చిత్రాన్ని హిందీలో డబ్  చేసి అక్కడ కూడా విడుదల చేద్దామనే ఆలోచనలో ఫిల్మ్‌మేకర్స్ ఉండడమేనని తెలిసింది.

Comments

comments