Home తాజా వార్తలు బైక్ ను ఢీకొట్టిన స్కూల్ బస్సు: ఒకరు మృతి

బైక్ ను ఢీకొట్టిన స్కూల్ బస్సు: ఒకరు మృతి

Bus-Accident, Bike Accident, Road accident

త్రిపురారం: పాఠశాల బస్సు ఢీకొని ఒకరు దుర్మరణం చెందిన ఘటన నల్లగొండ జిల్లాలోని త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామ శివారులో శనివారం ఉదయం చోటుచేసుకుంది. శివాని హై స్కూల్  కు చెందిన బస్సు విద్యార్థులతో పాఠశాలకు వెళ్తున్నప్పుడు బైక్ ను ఢీకొట్టింది. ద్విచక్రవాహనదారుడు ఘటనా స్థలంలో మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మృతుడు ఐలపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. వ్యక్తి మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.  మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం త్రిపురారం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఐలపురం గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

One Dead in School Bus Accident in Nalgonda

Telangana news