Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, 14 మందికి గాయాలు

TUFAN

నాగర్ కర్నూల్: బిజినేపల్లి మండలం వెలుగొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేడి తాకిడికి తుఫాన్  వాహనం టైరు పేలి  బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సాయమ్మ(54) అనే మహిళ మృతిచెందగా మరో 14 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను మహబూబ్ నగర్ ఎస్ విఎస్ ఆస్పత్రికి తరలించారు. బాధితుల స్వగ్రామం కొడంగల్ పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీ బాధితులు తెలిపారు.  మృతురాలి కొడుకు పెండ్లి చూపులకు నాగర్ కర్నూల్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవపరీక్ష నిమిత్తం దవాఖానకు తరలించారు.

Comments

comments