Home తాజా వార్తలు హరియాణాలో కాల్పులు : ఒకరి మృతి

హరియాణాలో కాల్పులు : ఒకరి మృతి

GUN

చండీగఢ్ : హరియాణాలోని రోహ్‌తక్ జిల్లాలో కాల్పులు జరిగాయి. మహిళల వేషంలో వచ్చిన కొందరు దుండగులు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి చనిపోయాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఓ కేసు విచారణ నిమిత్తం గ్యాంగ్‌స్టర్ రమేశ్‌లోహార్, అతడి అనుచరులను మంగళవారం ఉదయం పోలీసులు రోహ్‌తక్ జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు. అప్పటికే కోర్టు ప్రాంగణంలో మహిళల వేషంలో ఉన్న ఐదుగురు దుండగులు రమేశ్‌పై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, ముగ్గురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.