Home నిర్మల్ లారీ ఢీకొని ఒకరి మృతి

లారీ ఢీకొని ఒకరి మృతి

Road accident

భైంసా: భైంసా పట్టణంలోని శివాజీ చౌక్‌లో బుధవారం లారీ ఢీకొనడంతో రాజేందర్ అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. భైంసా పట్టణ ఎస్సై పూన్నం చందర్ తెలిపిన వివరాల ప్రకారం భైంసా పట్టణంలోని కోర్వగల్లికి చెందిన నివాసి అయిన రాజేందర్(42) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నడు. బుధవారం పనుల నిమిత్తం శివాజీ చౌక్ వెళ్తున్న సమయంలో మహారాష్ట్ర నుంచి వస్తున్న లారీ వేగంగా ఢీ కొనడంతో రాజేందర్ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి లారీతో పాటు డ్రైవర్‌ను ఆదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజేందర్ మరణంతో కుటుంబంలో విషాదాఛాయాలు అలుముకున్నాయి.