Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసి.. ఒకరి ప్రాణం తీశాడు..!

Driving-Talking-CellPhoneవిజయవాడ : ఓ ఆర్‌టిసి బస్సు డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో ఓ మెకానిక్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటన విజయవాడ బస్టాండ్‌లో చోటు చేసుకుంది. ఆర్‌టిసి గ్యారేజిలో సత్యనారాయణ అనే మెకానిక్ విధులు నిర్వహిస్తున్నాడు. అదే సమయంలో శిక్షణలో ఉన్న డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడతూ బస్సు నడిపాడు. ఒక్కసారిగా బస్సు అదుపు తప్పడంతో బస్సు సత్యనారాయణను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులు ఆదేశించారు.

Comments

comments