Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

Current-Shock

షాద్‌నగర్ :  ప్రమాద వశాత్తు విద్యుత్ వైరు తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని కిషన్‌నగర్ గ్రామంలో ఆదివారం చో టు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన యాదయ్య(40) వృత్తిరిత్యా గ్రామంలో ఎలక్ట్రీషన్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం గ్రామంలోని ఓ స్థంబంపై ఎక్కిమర మ్మత్తులు చేస్తుండగా అక్కడే కొద్ది ఎత్తులో ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైరు తగిలి అక్కడికి అక్కడే మృతి చెందాడు.

అయితే తాను మరమ్మత్తు చేసే విద్యుత్ వైర్లకు సంబం దించిన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆఫ్ చేసినప్పటికి హై టెన్షన్ వైర్లు ప్రమాద వశాత్తు తగిలి ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. భార్య నవనీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై దాస్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం షాద్‌నగర్ కమ్యునిటి ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు రాజ్‌కుమార్, అన్చితలు ఉన్నారు. యాద య్య మృతితో జీవనోపాధి కోల్పోయామని, తమ కుటుం బం రోడ్డు పడినట్లయిందని కుటుంబ సభ్యులు రోధనలు గ్రామంలో విశాధ ఛాయలు అలుముకు న్నాయి.

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే..

ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని కిషన్‌నగర్ గ్రామానికి చెందిన యాదయ్య విద్యుత్ వైర్లు సరిచేస్తుంగా ప్రమాద వశాత్తు విద్యుత్ వైర్లతు తగిలి మృతి చెందినవార్త తెలుసుకున్న షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి షాద్‌నగర్ కమ్యునిటి ఆసుపత్రికి చేరుకొని మృతిని కుటుంబ సభులను పరామర్శించారు. యాదయ్య కుటుం బాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పరామర్శించి నవారిలో మండల పార్టీ అధ్యక్షులు కట్ట వెంకటేష్ గౌడ్, ఎంపిటిసి చేగూరి రాఘవేందర్ గౌడ్, ఒగ్గు కిశోర్, గోపాల్ నాయక్, బాబర్‌ఖాన్, మాజీ ఎంపిపి వన్నాడ ప్రకాశ్ గౌడ్, గంగనమోని సత్తయ్య, గ్రామ సర్పంచ్ ఉన్నారు.

Comments

comments