Home వనపర్తి ఎస్‌బిహెచ్‌లో ఒకే ఒక్కడు

ఎస్‌బిహెచ్‌లో ఒకే ఒక్కడు

 స్టేట్ బ్యాంక్‌ను పరిశీలిస్తున్న ఎంపిపి గుంత మౌనిక

Bank-Manager

మదనాపురంః మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైద్రాబాద్  బ్యాంక్‌లో సరియైన సిబ్బంది లేక పోవడంతో అన్నీ తానై విధులను నిర్వహిస్తున్నారు. రెండు సంవత్సరాలుగా ఫీల్డ్ ఆఫీసర్‌గా జై విధులను నిర్వహి స్తున్నా రు. బ్యాంక్‌లో సరిపడా సిబ్బంది లేకపోవడంతో అటు ఖాతా దారులకు , రైతులకు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటు న్నా మని ప్రజలు ఆరోపిస్తున్నారు. బుధవారం ఎంపిపి గుంత మౌనిక ఎస్‌బిహెచ్ బ్యాంక్ కార్యాలయాన్ని పరిశీలించారు.

ఈ సందర్బంగా ఎంపిపి మాట్లాడుతూ మదానాపురంలో గత కొన్ని సంవత్సరాలుగా బ్యాంక్ ప్రజలకు సేవలను అంది ంచిందని రైల్వే మార్గం ,మార్కెట్ కు వచ్చే ప్రజలకు, గత వారం రోజులుగా సిబ్బంది కొరత కారణంగా లావా దేవీలు జరుగపోవడంతో ఖాతా దారులు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కుంటున్నారని ఆమె తెలిపారు.  ఇటీవల బ్యాంక్ మేనే జర్‌ను ట్రాన్స్‌పర్ చేయడం జరిగిందని కొత్త మేనేజర్‌ను నియమించకపోవడం వల్ల రైతులకు క్రాఫ్ లోన్స్ ,ఇబ్బం దు లకు గురౌతుందన్నారు. అనంతరం ఎంపిపి గుంత మౌ నిక మహబూబ్‌నగర్  ఎస్‌బిహెచ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనే జర్‌కు వినతిపత్రం అందజేశారు.