Home తాజా వార్తలు బైక్‌ను ఢీకొట్టిన లారీ: ఒకరి మృతి

బైక్‌ను ఢీకొట్టిన లారీ: ఒకరి మృతి

One Killed in Lorry ollided to Bike in Warangal Urban district

వరంగల్ అర్భన్: ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన వరంగల్ అర్భన్ జిల్లాలోని ఖిలావరంగల్ మండలం మామునూరు శివారు రోడ్డుపై బుధవారం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి  బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడిని కట్రియాల గ్రామానికి చెందిన తీగల ప్రభాకర్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.