Home సంగారెడ్డి వినియోగదారులకు షాక్

వినియోగదారులకు షాక్

వేలల్లో విద్యుత్ బిల్లులు
అంతా ఆన్‌లైన్ అంటున్న అధికారులు
లబోదిబోమంటున్న వినియోగదారులు

               Current-Bill

సంగారెడ్డి ప్రతినిధి : విద్యుత్ శాఖ వినియోగదారులకు షాక్ ఇస్తోంది. వినియోగదారులకు ప్రతినెలా వేలాది రూపాయల విద్యు త్ బిల్లులు వస్తున్నాయి. అదేమిటని వినియోగదారులు అధికారులను ప్ర శ్నిస్తే అంతా ఆన్‌లైన్ అంటూ చేతులు దులుపుకుంటున్నారు. విద్యుత్‌శా ఖ అధికారుల నిర్లక్షం, ఉదాసీనత వైఖరి కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. సంగారెడ్డి జిల్లాలో విద్యుత్ శాఖ అధికారులు ప్రతినెలా ఇచ్చే విద్యుత్ బిల్లులతో వినియోగదారులు బెంబెలెత్తుతున్నారు. జహీరాబాద్ మండలం దిడిగి గ్రామంలో సామాన్య కుటుంబానికి చెందిన బాబుమియాకు ప్రతినెలకు రూ.200 బిల్లు వస్తే జులై నెలలో 90వేల రూపాయల బిల్లు వచ్చింది. దీంతో అవాక్కయిన బా బుమియా తన ఇల్లు అమ్మినా కూడా 90 వేల రూపాయలు రావని, అంత బిల్లు ఎలా కట్టాలని ఆందోళనకు గురై గుండెపోటు వచ్చింది. బిల్లు వచ్చి న వారం రోజులకే బాబూమియా మానసిక క్షోభకు గురై గుండెపోటుతో మృతి చెందాడని అతని బంధువులు ఆరోపించారు. జహీరాబాద్ మండ లం దిడిగి గ్రామంలో మరో 106 మందికి కూడా వేలల్లో విద్యుత్ బిల్లులు వచ్చాయి.

జహీరాబాద్ ఘటన ఒకవైపు తీవ్ర కలకలం రేపుతున్నప్పటికీ అధికారులు మిగిలిన ప్రాంతాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లే దు. సంగారెడ్డి, పటాన్‌చెరు, జోగిపేట, రామచంద్రపురం తదితర మండలాల్లో కూడా విద్యుత్ బిల్లులు అధికంగా వచ్చాయని వినియోగదారులు వాపోతున్నారు. అధికంగా వచ్చిన బిల్లులు తగ్గించాలని కోరుతూ వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బిల్లులు ఎక్కువగా వచ్చాయని వినియోగదారులు వాపోతుంటే అధికారులు మా త్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సంగారెడ్డి పట్టణంలోని రాజంపేటకు చెందిన హసన్ మాట్లాడుతూ తనకు ప్రతినెలా రూ.180 బిల్లు వచ్చేదని కానీ జులై నెలలో ఒకేసారి రూ.1321 వచ్చిందని వాపోయారు. ఇం త బిల్లు ఎందుకు వచ్చిందని అధికారులను ప్రశ్నిస్తే అది అంతే కట్టాల్సిందేనంటూ సమాధానమిస్తున్నారన్నారు. ఐదు సంవత్సరాల నుంచి తాను రూ.200 మించి బిల్లు చెల్లించలేదని, తన వద్ద ఫ్రిడ్జ్‌గానీ, వాషింగ్ మిషన్‌గానీ ఏమీ లేదని అయినా వందల్లో బిల్లు రావడంపై విచారం వ్యక్తం చేశారు. పటాన్‌చెరులోని చిన్న హేయిర్ కటింగ్ షాప్‌కు ఇటీవల ఒక లక్షా 27వేల రూపాయల విద్యుత్ బిల్లు వచ్చింది.

పటాన్‌చెరు మం డలం ముత్తంగికి చెందిన శ్రీనివాస్ ఈ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. ప్రతినెలా రూ.200 నుంచి రూ.1000 వస్తుందని, జూన్ నెలలో రూ.971 బిల్లు వస్తే 28న చెల్లించాడు. ఇక జులై నెలలో బిల్లు ఈనెల 10వ తేదీన ఏకం గా రూ.127751 రూపాయలు వచ్చింది. ఈ సమస్య గురించి వినియోగదారుడు ట్రాన్స్‌కో అధికారులను ప్రశ్నిస్తే సంగారెడ్డిలో విద్యుత్ వినియోగదారుల సదస్సు జరుగుతుందని, ఆ సదస్సులో ఏమైనా సమస్యలుంటే చెప్పుకోవాలని అధికారులు ఉచిత సలహా ఇచ్చారని బాధితుడు వాపోయాడు. చిన్న హేయిర్ కటింగ్ సెలూన్‌కు లక్ష రూపాయలకు పై గా విద్యుత్ బిల్లు వచ్చిందని ఫిర్యాదు చేస్తే దాన్ని సరిచేయకుండా అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

జహీరాబాద్ మండలం దిడిగి గ్రామంలో 106 మంది వినియోగదారులకు పెద్ద మొత్తంలో బిల్లు రావడానికి సాంకేతిక కారణాలున్నాయని టాన్స్‌కో ఎస్‌ఇ. రవికుమార్ తెలిపారు. గ్రామంలోని మీటర్లు ఆగిపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందన్నారు. దిడిగి గ్రామంలో విద్యుత్ బిల్లు ఎక్కువగా రావడంతో మానసిక క్షోభకు గురై మృతి చెందిన బాబుమియా కుటుంబాన్ని ఆదుకుంటారా అని ప్రశ్నిస్తే బాబుమియా వి ద్యుత్ బిల్లు కారణంగానే చనిపోయినట్లు ఆధారాలు ఏమీ లేవని ఆయ న సమాధానమిచ్చారు. విద్యుత్ షాక్‌తో ఎవరైనా చనిపోతే పోలీసు కేసు, ఎఫ్‌ఐఆర్ కాపీ, పోస్టుమార్టం కాపీ ఇవన్నీ వుంటాయని, అలాంటి కేసు ల్లో పరిహారం అందే వీలుంటుందని తెలిపారు. కానీ బాబుమియా కేసు లో ఇలాంటివేమీ లేవని చెప్పారు. ఏదిఏమైనప్పటికీ ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్షం కారణంగా వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు.