Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

పెళ్లింట్లో చోరీ : ఒకరి ఆత్మహత్య

One Man Committed Suicide with Gold Theft at Koduparti

నాగర్ కర్నూల్ : పెళ్లింట్లో 25తులాల బంగారు నగలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటనతో మనస్తాపం చెందిన పెళ్లి కొడుకు తండ్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తిమ్మాజిపేట మండలం కోడుపర్తిలో శనివారం ఉదయం జరిగింది. పెళ్లికి వచ్చిన బంధువుల నగలు చోరీకి గురికావడంతో పెళ్లి కొడుకు తండ్రి శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గ్రామ ప్రజలు, బంధువుల ముందు తన పరువు పోయిందన్న బాధతో ఆయన తన పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్‌రెడ్డి మృతితో భయపడిన దుండగులు తాము చోరీ చేసిన నగలను మృతుడి ఇంటి సమీపంలో పడేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

One Man Committed Suicide with Gold Theft at Koduparti

Comments

comments