Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్: మావోయిస్టు హతం

 One Maoist Died In Chatthish Gahar Encounter

భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో ఆదివారం చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్లో ఓ మావోయిస్టు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా, బస్తర్ అటవీ ప్రాంతాల్లో గత నాలుగు రోజలుగా పోలీసులు, సిఆర్‌పిఎఫ్ బలగాలు విస్తృత కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మావోయిస్టుల కదలికలు ఉన్నాయనే పక్కా సమాచారం మేరకు అడవిని జల్లెడ పడుతున్న క్రమంలో పోలీస్ బలగాలకు మావోయిస్టులు తారపడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య సుమారు గంట పాటు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది . ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన జగ్గు అనే మావోయిస్టు పోలీసు తుటాలకు బలయ్యాడు. జగ్గు గతంలో అనేక హింసాత్మక సంఘటనలు చేసి ఉన్న నేపధ్యంలో ఆయనే పై రూ.3 లక్షల రివార్డు ఉంది. ఎదురు కాల్పుల ఘటనలో జగ్గు మినహా ఎవ్వరూ మృతి చెందలేదు. మరి కొందరికి గాయాలు అయినప్పటికీ అటవీ మార్గం ద్వారా పారిపోయినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో 302 రైఫల్, ఒక నాటు తుపాకీ లభ్యమైనట్లు తెలుస్తోంది.

Comments

comments