Home జగిత్యాల పెళ్లి వేడుకలో ఘర్షణ: ఒకరి మృతి

పెళ్లి వేడుకలో ఘర్షణ: ఒకరి మృతి

She is the widest wife to kill her husband

జగిత్యాల: పెళ్లి వేడుకలో జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మోతెమాలవాడలో ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. గత రాత్రి మద్యం సేవిస్తుండగా ఇద్దరు మిత్రుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో ఒకరు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అభిలాశ్ అనే యువకుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో దుర్మరణం చెందగా కిరణ్ అనే మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కిరణ్ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.