రఘునాథపాలెం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును లారీ ఢీకొట్టడంతో ఒకరు దుర్మరణం చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి కారు డ్రైవర్ గా గుర్తించారు.