Search
Friday 21 September 2018
  • :
  • :

కంటైనర్ బీభత్సం: ఒకరు మృతి

TOLLGATE

మెదక్:  కంటైనర్ బీభత్సం సృష్టించిన ఘటన తూప్రాన్ టోల్‌గేట్ వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. టోల్‌గేట్ వద్ద కంటైనర్ అదుపుతప్పి రెండు కార్లను ఢీకొట్టడంతో ఒకరు దుర్మరణం చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో వరంగల్ సిపి రవీందర్‌ కొంచెంలో ఈ  ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కంటైనర్ దూసుకెళ్లడంతో రెండు టోల్‌ గేట్లు ధ్వంసమయ్యాయని వెల్లడించారు.

Comments

comments