Home కుమ్రం భీం ఆసిఫాబాద్ కన్న బిడ్డను చూసేందుకు వెళ్లి కానరాని లోకాలకు

కన్న బిడ్డను చూసేందుకు వెళ్లి కానరాని లోకాలకు

               Road-Accident

సిర్పూర్(యు): జైనూర్ మండలం పొలాస గ్రామా నికి చెందిన అమర్ సింగ్(30) ఆదివారం నేరడిగొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఆదివారం ఉదయం అత్తగారి ఇళ్లయిన సారంగా పూర్ మండలానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసు కున్నట్లు కుటుంబీకులు తెలిపారు. భార్య డెలివరీ కావడంతో చూసేందుకు వెళుతున్న తరుణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పొలాస గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సిర్పూర్(యు) మండలం పంగిడిలో సిఆర్ పిగా విధులు నిర్వహి స్తున్న ఆయన అందరితో కలుపుగోలుగా ఉండేవాడు. ఆదివా రం ఉదయం సారంగాపూర్‌కు వెళుతుండగా నేరడిగొండ వద్ద ఆగి ఉన్న లారిని ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకున్నదని గ్రామస్థులు తెలిపారు. ప్రమా దంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో  కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. సమాచారం తెలుసుకున్న గ్రామ సర్పంచ్, గ్రామస్థులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అమర్ సింగ్ మృతి పట్ల పలువురు నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.