Home తాజా వార్తలు కూలీల ట్రాక్టర్ బోల్తా: ఒకరి మృతి

కూలీల ట్రాక్టర్ బోల్తా: ఒకరి మృతి

Tractor-RollOver-in-Khammam

చర్ల : భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని ఆర్‌కొత్తగూడెం రహదారిపై గురువారం మిర్చి ట్రాక్టర్ కూలీలను తీసుకొని వెళ్తున్నప్పుడు ట్రాక్టర్ బోల్తా పడి ఒక మహిళ మృతి చెందింది. చత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన నాలుగు గ్రామాల కూలీలను చర్లలోని మిర్చి తోటల్లో పని కోసం కిష్టారం గ్రామం నుంచి తీసుకొస్తుండగా ఆర్ కొత్త గూడెం వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది.  అకస్మాత్తుగా కుక్క ఎదురవడంతో డ్రైవర్ బ్రేక్ కొట్టడంతో ట్రాక్టర్ తిరగబడింది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలు కాగా 42 మంది స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించగా బుద్రి అనే మహిళ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది. చర్ల ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.