Home తాజా వార్తలు రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని వ్యక్తి మృతి

Road-Accident

హైదరాబాద్: బేగంపేటలోని ఫతేనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని ఓ గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వ్యక్తి పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి వయస్సు 45 ఏళ్లు ఉంటాయి, ఒంటిపై తెలుపు రంగు అంగిపై నిలువు గీతాలు, చాక్లెట్ రంగు ప్యాంట్ ధరంచి ఉన్నాడు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే ఈ నంబర్ కు 9848625307 ఫోన్ చేయగలరు.