Home తాజా వార్తలు రెండు లారీలు ఢీ: ఒకరి మృతి

రెండు లారీలు ఢీ: ఒకరి మృతి

Lorry-Accident

అమరావతి: రెండు లారీలు ఢీకొన్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం బసినికొండ సమీపంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. తమిళనాడు నుంచి అనంతపురం వెళ్తున్న లారీని తాడిపత్రి నుంచి చెన్నై వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి.  గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.