Search
Wednesday 14 November 2018
  • :
  • :

ఫోన్ మోగింది… రూ.15వేలు గోవిందా

CELL-PHONE

ఆన్‌లైన్ సమాచారం అంటూ మోసం, దగాపడుతున్న ఖాతాదారులు
సిరిసిల్ల టౌన్: సిరిసిల్ల పట్టణంలో ఆన్‌లైన్ సేవల ద్వారా బ్యాంకు ఖాతాల్లో మార్పులంటూ కొంత మంది వ్యక్తులు ఫోన్‌లు చేస్తూ అకౌంట్ల నుంచి డబ్బులను దోచుకుంటున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక పాత బస్టాండ్ ఏరియాలోని శ్రీనివాస్ అనే వ్యక్తికి ఫోన్ వచ్చింది.ఆన్‌లైన్ సేవల ద్వారా బ్యాంకు వివరాలు తెలపాలంటూ సదరు వ్యక్తి అడిగాడు. నిజమే కావచ్చంటూ ఖాతా వివరాలు ఏటిఏం పిన్ నెంబర్‌తో సహా చెప్పినాడు. ఇంకే ముందు నిమిషాల్లో అతని ఖాతా నుండి రూ.15వేలు డ్రా అయినట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది.

వెంటనే కంగారు పడుతూ బ్యాంకుకు పరుగులు తీశాడు. బ్యాంక్ వారు గమనించి ఖాతా నుండి డబ్బులు డ్రా అయినట్లు వెల్లడించారు. అంతే తనకు బ్యాంకు వారు ఫోన్ చేశారంటూ వాదించినా లాభం లేకుండా పోయింది. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. అప్పటికే ఫోన్ స్విచాఫ్ చేసి ఉంది. ఇంక చేసేది లేక లబోదిబోమంటూ ఇంటి ముఖం పట్టాడు. గత కొన్ని రోజులుగా ఇలాంటి ఫేక్ కాల్స్ పట్టణంలో తరచుగా రావడం పట్టణ వాసుల్లో కలవరం లేపుతున్నాయి. డిజిటలైజేషన్‌లో భాగంగా బ్యాంక్ వారు ఎలాంటి నిబంధనలు పెడుతారోనని కొంత మంది నిరక్షరాస్యులు బ్యాంకు అనగానే సమాచారం ఇస్తున్నారు.

Comments

comments