Home ఆఫ్ బీట్ చిదంబర ఆలయం

చిదంబర ఆలయం

చిదంబర రహస్యం
చిదంబరంలో పూజించే పరమశివుడు నిరాకార స్వరూపుడై తన సతీమణి శివగామితో ఆద్యంతరహితమైన చిద్విలాసంతో ఆనందతాండవ నృత్యాన్ని నిరంతరం చేస్తుంటాడు. ఆ ప్రదేశాన్ని తెరతో కప్పి వుంచే వారని, తొలగించగా, వేలాడు, బంగారు బిల్వ పత్రాల వరుసలు స్వామి సమక్షాన్ని సూచిస్తూ కనపడతాయి. తెరకు బయటవైపు వల్లగావుండి (అజ్ఞానాన్ని సూచిస్తుంది) లోపలవైపు ప్రకాశవంతమైన ఎరుపులో వుండి జ్ఞానాన్ని సూచిస్తుంది.

Chidamabramప్రాచీన, పూర్వ-మధ్యస్థ యుగాలలో నిర్మించినప్పటికీ ప్రత్యేకించి పల్లవ, చోళ రాజుల కాలంలో ఈ ఆలయంలో పలు నూతన రూపకల్పనలు జరిగాయి. ఈ ఆలయం పునఃసృష్టికి సనాతన విశ్వకర్మల వంశస్థుడైన విదువేల్విడుగు- పెరుమక్తన్ ప్రధాన రూపశిల్పి. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు తూర్పునగలని కడతారు జిల్లాలోని ‘కారైకల్’కి ఉత్తరంగా 60 కి.మీ. దూరంలో పాండిచ్చేరికి దక్షిణంగా 78కి.మీ.ల దూరంలో ఉన్న నగరమే ఈ “చిదంబరం” ఆలయం. నగరం నడిబొడ్డున 40 ఎకరాల (1,60,000మీ॥) విస్తీర్ణంలో శైవులు, వైష్ణవులదేవతలు కొలువున్న అతికొద్ది దేవాలయాల్లో ఈ చరిత్రాత్మక దేవాలయం ఒకటి. చిదంబరం అంటేనే చైతన్యం. ‘చిత్ ఆకాశం’ అంబరం ఇతిహాసాల ప్రకారం మానవుడు చేరుకోవాల్సిన అంతిమ లక్షం.
ఆలయ స్థాపన
ఈ ఆలయానికి తొమ్మిది ముఖద్వారాలు వీటిలో నాల్గింటికి ‘7’ స్థాయిలు కలిగిన ఎత్తైన పగోడాలు, గోపురాలు తూర్పు, దక్షిణ, ఉత్తరాన వున్నాయి. తూర్పు దిక్కున గోపురానికి భారతీయ నృత్యరూపమైన భరతనాట్యంలోని 108 భంగిమల శిల్పాలు చెక్కబడి వున్నాయి. 5 సభావేదికలు లేదా మందిరాలలో ఒకటి. నటరాజస్వామి ఆయన సతీమణి ‘శివగామ సుందరి’ కొలువున్న గర్భగుడి ‘చిత్ స భై’ చిత్‌సభై ఎదురుగుండా వున్న కనక సభైలో ప్రతిదినం చేయాల్సిన క్రతువులను నిర్వహిస్తారు. ఆలయం ధ్వజస్థంభానికి దక్షిణం వున్న నృత్యసభై లేదా నాట్య సభైలో కాళికాదేవితో కలిసి నాట్యంచేసే స్థలాన్ని ప్రతిసృష్టించారని చెబుతారు.
ఈ గుడిని మానవాకృతి యోగలక్షణాలను దృష్టిలో వుంచుకొని నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తోంది. అనగా రాజ్యసభై లేదా 1000 స్తంభాల మందిరం పరీక్షగా 1000 స్తంభాల కమలం యోగచక్రం లేదా సహస్రాకారం (ఇది యోగాలా శిరస్సుపై భాగానికి సంబంధించినదిగా చెప్పబడింది. అంటే సహస్రాకార చక్రం మీద ఏకాగ్రత వహించి ధాన్యం చేసేవారు శక్రంలోకి లీనమౌతారని చెబుతూ ఇది యోగాభ్యాసంలో పరాకాష్ఠగా వర్ణిస్తారు.
పురావస్తు శాసనాల ప్రకారం మానవాకృతికి సంబంధించి తొమ్మిది ముఖద్వారాలు మానవశరీరంలోని నవరంధ్రాలను సూచిస్తాయి. గర్భగుడి 28 స్తంభాలతో కట్టబడి ‘28’ ఆగదూలను సూచిస్తుంది. పై కప్పు ‘64’ దులాలతో కట్టారు. 64 కళలను సూచిస్తాయి. అడ్డదూలాలు అసంఖ్యాకమైన రక్తనాళాలను సూచిస్తాయి. పైకప్పు మీద ‘శివాయనమ’ అని చెక్కబడి 21,600 బంగారు పలకలు, 21,600ల శ్వాసలను సూచిస్తాయి. ఈ బంగారు పలకలను బిగించటానికి ఉపయోగించిన 72,000 బంగారపు మేకులు మానవ శరీరంలోని నాడుల సంఖ్యను సూచిస్తుంది. ఆలయానికి తొడుగులను పోలిన 5 ప్రాకారాలు వున్నాయి. కప్పు మీద వున్న 26,000 బంగారు పలకలు ఒకరోజులో ఒక వ్యక్తి తీసే శ్వాసల సంఖ్యను సూచిస్తుంది. శరీరంలో గుండె ఎడమ వైపు వున్నట్లుగా, చిదంబరంలోని గర్భగుడి కూడా కొంచెం ఎడమవైపుగా వుంటుంది చిత్‌సభ కప్పు మీద వున్న 9 కలశాలు (రాగితో చేయబడినవి) 9 శక్తులను ప్రదర్శిస్తుంది. అర్థ వుండపానికి వున్న 6 స్తంభాలు ఆరు శాస్త్రాలను సూచిస్తాయి. అర్థమండపానికి పక్కనున్న మండపానికి ‘18’ స్తంభాలు ‘18’పురాణాలకు ప్రత్యేక చిత్ సభ పైకప్పుకి “ఊతమిచ్చే నాలుగు స్తంభాలు నాలుగు వేదాలకు ప్రతీక. దక్షిణ భారతదేశంలో వున్న చాలా ఆలయాలు సజీవ స్మారక కట్టడాలుగా పేర్కొనబడినవి.
పల్లవరాజులలో ‘సిమ్మ వర్మన్’ పేరుతో ముగ్గురు రాజులున్నారు. (క్రీ.శ.275-300, 436-460, 550-560) సుమారు ‘6’వ శతాబ్దంలో ‘తిరునావుక్కరస్’ కాలం నాటికీ ఈ ఆలయం ప్రాచుర్యం పొందింది. ‘సిమ్మవర్మన్ పల్లవరాజుని తరువాత రాజరికాన్ని వదిలి చిదంబరం వచ్చి నివసించాడని నమ్ముతారు.
Chidambaram3రాజరాజచోళ 985-1014 క్రీ.శ. రాజేంద్రచోళ 1012-1044 కులోత్యుంగచోళ 1070-1120 మొదలైన చోళరాజులు. పాండ్యరాజుల్లో. జిటావర్మన్, త్రిభువన చక్రవర్తి సుందర పాండ్యన్ 1251-1268 కాలంలో త్రిభువన చక్రవర్తి. కులశేఖర పాడ్యన్ 1268-1308.
పల్లవ రాజులలో అవని ఆల పిరుదాన్. 1216-1242, విజయనగర సామ్రాజ్యంలో అచ్యుత దేవరాయులు. 1529-1542 మొదలైన వారు ఈ ఆలయాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ మెరుగులు దిద్దుకుంటూ వచ్చారు. చారిత్రాత్మకంగా దక్షిణగోపురం నిర్మించింది ఒక పాండ్యరాజు. దీనికి గుర్తుగా గోపుర పైభాగాన పాండ్యరాజుల ‘చేప చిహ్నం’ ఉంది. పడమట గోపురం నిర్మించింది. ‘జిడవర్మన్ సుందరపాండ్యన్’, ఉత్తర గోపురాన్ని నిర్మించింది. విజయనగర రాజైన కృష్ణదేవరాయులు. తూర్పు గోపురం నిర్మించింది ‘కోపెరున్సిగాన్’.
గుడికి బంగారం ఆభరణాలను విరాళాలుగా ఇచ్చిన దాతలలో ముఖ్యంగా పుదుకోట్టై మహారాజు శ్రీ సేతువతిని ముఖ్యంగా చెప్పుకుంటారు. ఆయన ఇచ్చిన పచ్చలహారం విగ్రహానికి ఇప్పటికీ అలంకరించబడుతున్నది.
దాడులు
ఉత్తర భారతదేశంలోని అనేక గుడులు విదేశీ దండయాత్రలలో నాశనం చేయబడ్డాయి. వాటితో పోలిస్తే దక్షిణ భారతదేశంలోని ఆలయాలు శతాబ్దాల నుండి ప్రశాంతంగానే వున్నాయి. బహుశా ఆలయాలు దక్షిణ భారతదేశంలో వికసించడానికి ఇదొక ముఖ్యకారణం కావచ్చు. అయితే చిన్న చిన్న యుద్ధాలు లేకుండా పోలేదు. చాలా సందర్భాలలో దండయాత్ర నుంచి రక్షించుకోనడం కోసం దీక్షితారులు ఆలయాన్ని మూసివేసి విగ్రహాలను చాలా రక్షణతో కేరళలోని ‘అల్లపూజ’కు తీసుకువెళ్లారు. దండయాత్ర భయం తగ్గగానే తిరిగి వచ్చేవాడు.
ఇతిహాసం :
పంచభూతాలో పంచభూతాల స్థలాలు కొలువుదీరిన ప్రదేశాలలో ఒకటైన చిదంబరంలో. ఆకాశం లేదా ‘ఆగయం’గా సాక్షాత్కరించిన స్వామిని పూజిస్తారు. మిగతావి కాంచీపురంలోని ఏకాంబరేశ్వరాలయంలో భూమిగా, తిరుచిరాపల్లిని జంబుకేశ్వరాలయంలో నీరుగా, తిరువన్నామళైలోని ‘అన్నమళైయర్ ఆలయంలో అగ్నిగా, శ్రీకాళహస్తిలోని కాళహస్తి ఆలయంలో గాలివాయువుగా సాక్షాత్కరిస్తారని ఇతిహాసాల ద్వారా తెలుస్తున్నది.