Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

అతిగా మద్యం సేవించి ఒకరు మృతి

One of the victims of alcohol was dead

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్‌లో గల మమత హాస్పిటల్ పై అంతస్తు బాల్కనిపై ఒక వ్యక్తి శవమై ఉన్నట్టు స్థానికులు అందించిన సమాచారం మేరకు పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్సై ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని కౌసర్‌నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ బాబా (55) కూలీ పని చేసి జీవితం కొనసాగించే వాడని, ఈ మధ్య కాలంలో తాగుడుకు బానిసైన బాబా అతిగా మద్యం సేవించి మృతి చెంది ఉన్నట్టాడాని అనుమానిస్తున్నట్టు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Comments

comments