Home తాజా వార్తలు గోదావరిఖనిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

గోదావరిఖనిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

                       Suicide-with-kerosene

పెదపల్లి: గోదావరిఖని చౌరస్తాలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు అడ్డుకొని ఆస్పత్రికి తరలించారు. కేరళ లాటరీలు నిర్వహిస్తున్నారనే కేసులో శనివారం స్వామి రాజును పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం స్వామిరాజు బెయిల్‌పై విడుదలై ఆత్మహత్యకు యత్నించారు. లాటరీ కేసులో పోలీసులు తనని అక్రమంగా అరెస్టు చేసి, ఇబ్బందులకు గురి చేశారని స్వామిరాజు ఆవేదన వ్యక్తం చేశాడు.