Home తాజా వార్తలు ఉరేసుకొని ఓ వ్యక్తి మృతి

ఉరేసుకొని ఓ వ్యక్తి మృతి

Prisoner-Suicide

వరంగల్:  మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పెద్ద నాగారం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. తుమ్మోజు సందీప్(19) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతో సదరు వ్యక్తి సూసైడ్ చేసుకున్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.