Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

చెట్టును ఢీకొట్టిన లారీ… వ్యక్తి మృతి

Lorry-Accident

అశ్వారావుపేట : డ్రైవర్ నిద్రావస్ధలోకి జారుకోవడంతో లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున అశ్వారావుపేట- ఖమ్మం రాష్ట్రా రహదారిపై వ్యవసాయ కళాశాల సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  వరంగల్ నుండి కాకినాడకు లిక్విడ్ తీసుకువెళ్తున్న ట్యాంకర్ అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాల సమీపంలోకి వచ్చేసరికి డ్రైవర్ నిద్రావస్ధలోకి జారుకోవటంతో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్యాంకర్ క్లీనర్‌గా పనిచేస్తున్న విజయనగరం జిల్లా, పి. కొనవలస గ్రామానికి చెందిన చెన్నారావు(28) అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌ఐ సురేష్ ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments