Search
Monday 24 September 2018
  • :
  • :

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

East Godavari : One Person died in Road Accident

తూర్పుగోదావరి : రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అన్నవరం బైపాస్ రోడ్డుపై గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. రహదారిపై ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ టైరు మారుస్తున్న క్లీనర్ అల్లాడ శివ(18) మృతి చెందాడు. శివ స్వస్థలం విశాఖపట్నం ఉప్పాడ. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

 One Person died in Road Accident

Comments

comments