Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

చెట్టును ఢీకొన్న కారు.. ఒకరి మృతి

One Person Dies In Road Accident In Kamareddy Dist,

కామారెడ్డి: డ్రైవర్ నిద్రమత్తులో కారు చెట్టును ఢీకొన్న ప్రమాదం కామారెడ్డి ,మాచారెడ్డి మార్గంలో ఉగ్రవాయి మైసమ్మ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. వివరాలలోకి వెళితే..పోలీసుల కథనం ప్రకారం.. మాచారెడ్డి నుండి చేగుంట వెళ్తున్న కర్ణాటకకు చెందిన కెఎ65 ఎమ్ 5555 హుండాయ్ వర్ణ కారులో చేగుంట వెళుతున్నారు. నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ ఉగ్రవాయి మైసమ్మ మలుపు వద్ద అదుపు తప్పి కారు చెట్టును ఢీకొట్టిందని దేవునిపల్లి ఎస్‌ఐ సంతోష్ కుమార్ తెలిపారు. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన డ్రైవర్ ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. మరోక వ్యక్తి ఫణీంధర్ (35) కామారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తీవ్రగాయాలతో కాలు, చెయ్యి విరగిందన్నారు. డ్రైవర్ ప్రవీణ్ను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి తరలించామని దేవునిపల్లి ఎస్‌ఐ సంతోష్ కుమార్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

comments