Search
Thursday 15 November 2018
  • :
  • :

గూడు చెదిరిన జీవితం..

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన యువకుడు
విరిగిన రెండు కాళ్లు, నడుము, కుడి భుజం
వైద్యం చేయించుకోలేని దీనస్థితిలో కుటుంబం
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు

Patients

ఇల్లంతకుంట: మండలంలోని అనంతారం గ్రామానికి చెంది న బడుగు రమేష్(27) అనే యువకుడు ఈ నెల 18న కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం అల్గునూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్రంగా గాయపడ్డాడు. రోడ్డు ప్రమాదంలో రమేష్ రెండు కాళ్లు పూర్తిగా విరిగి పోయి,నడుము భాగం కూడా పూర్తిగా దెబ్బతింది. కుడి భుజంలో కూడా ఎ ముకలు విరిగిపోయాయి.రమేష్‌ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీ ంనగర్‌లోని ఓప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు రమేష్‌కు ఆపరేషన్ చేయాలని, ఆరోగ్యశ్రీ కార్డు వర్తించదని, సుమారు రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని, అప్పులు చేసి సుమారు ముఫ్పై వేల వరకు ఆసుపత్రిలో చెల్లించామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆపరేషన్ చేయాలంటే వైద్య ఖర్చులు రెండు లక్షలు రూపాయలు కావాలని, రమేష్‌కు ఉండేందుకు ఇల్లు, వ్యవసాయ భూమి కూడా లేదు.

దిక్కు తోచనిస్థితిలో రమేష్ కుటుంబం కొట్టుమిట్టాదుతోంది. రమేష్ హార్వేస్టర్ డ్రై వర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుండేవాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరడంతో అతని కుటుంబాన్ని ఆదుకునేవారే కరువయ్యారు. కుటుంబ పోషణ, వైద్య చికిత్స కోసం డబ్బులు లేకపోవడంతో వారు నరకయాతన అనుభవిస్తున్నారు. డబ్బులు చెల్లిస్తేనే ఆపరేషన్ చేస్తామని ఆసుపత్రి వైద్యులు తేల్చి చెప్పడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. మనసున్న దాతలు ఎవరైనా ముందుకు వచ్చి వైద్యం కోసం ఆర్థిక సహాయం అందించాలని వేడుకుంటున్నారు.

పాపం.. పసి పాపలు..

రమేష్ తల్లిదండ్రులు చిన్ననాడే మృతి చెందారు. రమేష్‌కు భార్య, ఇద్దరు కూ తుర్లు ఉన్నారు. పెద్దపాప హానీ(14నెలలు), రెండవ పాప నెల రోజుల పసికం దు. ఓ వైపు భర్త చావుబతుకులతో పోరాటం చేస్తుండగా,మరో వైపు చిన్నారి కూతుళ్ల పోషణ భారంతో రమేష్ భార్య లావణ్య నరకయాతన అనుభవిస్తోంది. రమేష్ భార్య వైద్య ఖర్చుల కోసం పుస్తెలతాడును కూడా తాకట్టు పెట్టింది. దా తలు ముందుకు వచ్చి రమేష్ కుటుంబానికి చేయూతనందించి, వైద్య ఖర్చు లకు ఆర్థిక సహాయం అందించాలని వేడుకుంటున్నారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలనుకుంటే సెల్ 9618551087, 9618460691 నెంబర్‌లలో సంప్రదించాలని బాధితులు వేడుకుంటున్నారు.

Comments

comments