Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

మద్యానికి బానిసై ఒకరి మృతి

One person in of the victims of alcohol was dead
కౌటాల: మద్యానికి బానిసై మృతి చెందిన సంఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండలంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం… చింతలమానేపల్లి మండలంలోని లంబడిహేటి గ్రామానికి చెందిన బానోత్ తిరుపతి (39) గత కొన్ని రోజుల నుండి మద్యానికి బానిసై శుక్రవారం కౌటాల మండలంలోని వైగాం సమీపంలోని చెరువు వద్ద మృతి చెందినట్టు ఆయన తెలిపారు. మృతుడు మతిస్థిమితం కోల్పోయి ఇక్కడి వచ్చి మద్యం అతిగా తాగి ఉండడంతో ఎండ తీవ్రతతో మృతిచెంది ఉంటాడని ఎస్సై తెలిపారు. మృతుడికి ఒక కూతురు , ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య సరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Comments

comments