Home కరీంనగర్ కారు ఢీకొని వ్యక్తి మృతి

కారు ఢీకొని వ్యక్తి మృతి

One person killed in car accident

తిమ్మాపూర్‌: మండలంలోని అలుగునూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎల్‌ఎండి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలుగునూర్ కు చెందిన చేపల కాలనీ వాసి గీకురు రాజమౌళి అనే వ్యక్తి రోడ్డు దాడుతుండగా కారు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. చిగురుమామిడి నుండి వస్తున్న కారు షిఫ్ట్ డిజైర్ కారు కరీంనగర్ వైపు వెలుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ అజాగ్రత్తగా నడపడమే ప్రమాదానికి కారమైనట్టు పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.