Home ఆదిలాబాద్ రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

One person killed in road accident

ఉట్నూర్ రూరల్‌: మండలంలోని పులిమడుగు గ్రామ సమీపంలో శుక్రవారం టవేర వాహనం మోటారు సైకిల్‌ను వెనుక వైపు నుంచి బలంగా ఢీ కొన్న సంఘటనలో ఇచ్చోడ మండలానికి చెందిన కాత్లే ప్రభాకర్(45) అక్కడిక్కడే మృతి చెందాడు. ఉట్నూర్ ఎస్సై నరేష్‌ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… ఇచ్చోడ మండలానికి చెందిన కాత్లే ప్రభాకర్ ఐటిడిఎ కార్యాలయంలో పనుల నిమిత్తం ఇచ్చోడ నుంచి ఉట్నూర్‌కు ద్విచక్ర వాహనంపై వస్తున్న క్రమంలో పులిమడుగు గ్రామ సమీపంలో వెనుక వైపు నుంచి టవేర వాహనం బలంగా ఢీ కొనడంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య నీలాబాయి, కుమారుడు జీవన్‌లు ఉన్నారు. కాగా సంఘటన స్థలానికి ఎస్సైతో పాటు సిఐ కడారి వినోద్ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.