Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

హైదర్‌గూడలో వ్యక్తి దారుణ హత్య

The man in Haiderguda is a murderous assassination

రాజేంద్రనగర్ : ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన హైదర్ గూడలో బుధవారం చోటు చేసుకుంది. అతని కోసం మాటు వేసిన ఇద్దరు వ్యక్తులు బైక్ పై వెళుతున్న సమయంలో మృతుని కళ్లలో కారం చల్లి బండరాయిలో మోది దారుణంగా హత్యచేశారు. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బహదూర్‌పూర ప్రాంతానికి చెందిన ఖాలీద్ (30) వృత్తిరీత్యా వాటర్ ప్లాంట్ వ్యాపారి. కాగా మంగళవారం అర్థరాత్రి 2 గంటలకు కిషన్‌బాగ్ నుంచి హైదర్‌గూడ వైపు వెళుతున్నాడు. అదే సమయంలో ముందుగానే పథకం వేసుకుని ఖాలీద్ రాక కోసం వేచి చూస్తున్న ఇద్దరు వ్యక్తులు అతని కళ్లలో కారం చల్లారు. దాంతో అతడు బండి పై నుంచి కిందపడిన వెంటనే ఖాలీద్ తల పై బండరాయితో కొట్టి చంపారు. తర్వాత అక్కడి నుంచి పరారైయ్యారు.

స్థానికులు సమాచారం మేరకు రాజేంద్రనగర్ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పరిశీలించి దుండగులు హత్యకు ఉపయోగించిన బండరాయి సీజ్ చేశారు. గతంలో ఖాలీద్‌ కి డబ్బు అప్పుగా ఇచ్చిన వారే  ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమిక విచారణలో తెలింది. కిషన్‌బాగ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఖాలీద్‌కు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాడానికి రూ.5లక్షలు అప్పుగా ఇచ్చినట్టు సమాచారం. ఖాలీద్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించడానికి ససేమిరా అన్నాడు. దీంతో  పై ఆగ్రహం పెంచుకున్న ఆ ఇద్దరు అతడిని హత్యచేయడానికి ప్లాన్ చేసి  ఉంటారని తెలుస్తోంది. ఘటన స్థలం, ఆ చుట్టు ప్రక్కల ఉన్న సిసి టివి ఫూటేజిలను పరిశీలించిన పోలీసులు అనుమానిత ఇద్దరు నింధితల పై విచారణ చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ సురేష్  చెప్పారు.

Comments

comments