Search
Saturday 17 November 2018
  • :
  • :

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ వ్యక్తి హత్య ఉదంతం

MURDERరంగారెడ్డి: చేవెళ్ల మండలం రావులపల్లిలో ఆలస్యంగా హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. మూడు నెలల క్రితం రావులపల్లిలో మహేందర్ అనే యువకుడు అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు ఎంత వెతికిన అచూకి లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా అనుమానితులైన బంధువులు, స్థానికులను పోలీసులు విచారించారు. మహేందర్‌ను హత్య చేసినట్లు అనుమానితులు ఒప్పుకున్నారు. పోలీసులు రావులపల్లిలో మహేందర్ శవాన్ని వెలికితీస్తున్నారు.

Comments

comments