Search
Wednesday 26 September 2018
  • :
  • :

బస్సు ఢీ కొని ఒకరి మృతి

One person was killed by the bus

మల్హర్: భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని కొండంపేట గ్రామ పరిధిలో ఉన్న కాటారం మంథని ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి ఆర్టిసి బస్సు ఢీ కొని ఏనుగు రాజయ్య(51) అనే వ్యక్తి మృతి చెందాడు. కుటింబికుల వివరాల ప్రకారం… మృతుడు రాజయ్య రోడ్డు ప్రక్కన గత కొన్నాళ్లుగా ఇల్లు నిర్మించుకోని నివసిస్తున్నాడు. రాజయ్య రోడ్డు అవతలి వైపు పని మీద వెల్లగా తన మనుమడు చూసి నేను వస్తా అని రోడ్డు పైకిరాగా బస్సు వస్తుందని రావద్దని మనుమడిని కాపాడేందుకు మనుమడి దగ్గరుకు తిరిగి వస్తుండగా రోడ్డు పై వస్తున్న అన్నారం వెళ్లే మంథని డిపో బస్సు పిల్లడిన్ని తప్పించి రాజయ్యను ఢీ కొట్టండంతో రాజయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనతో రాజయ్య కుటింబం కన్నీరు మున్నీరైంది. ఈసంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతిని కుటుంబాన్ని పలువురు పరామర్శించి ఆర్టిసి వారు పరిహారం అందజేయాలని కోరారు.

Comments

comments